Saturday, August 13, 2011

మన దేశ చరిత్రకు ఆధారాలు

  మన దేశ చరిత్ర హరప్పా నాగరికతతో ప్రారంభమైంది.హరప్పా నాగరికతలో లిపి ఏర్పడింది.కానీ మన దేశచరిత్రకు సాహిత్య ఆధారంగా ఆ కాలంలో లిపి లేని ఆర్యులు రాసిన ఋగ్వేదం ఉంది.ఇది ఎలా జరిగింది?
  •    కొత్త రాతి యుగ ప్రారంభ కాలంలో నైల్,టైగ్రిస్,సింధు నదీ ప్రాంతాలలో నాగరికత(నగరం),లిపులు రూపొందాయి అని చరిత్ర చెబుతుంది.
  •    అందువల్ల ఆ పట్టణ అవశేషాలు ఆ నాగరికతలో భాగంగా ఉన్నాయి.భారతీయ సాంప్రదాయకత-సంస్కృతి   లో పి.ఆర్.రావు గారు  ఈ కింది విధంగా చెప్పారు-        
ఆర్యులు అడిగిడిన తర్వాతే భారతదేశంలో  నాగరికత ప్రారంభమైందని విశ్వాసం కొంత కాలం ఉండేది.కానీ 1992లో ఆర్.డి.బెనర్జీ నాయకత్వంలో జరిగిన తవ్వకాలలో హరప్పా,మొహంజదారో పట్టణ అవశేషాలు బయటపడిన తర్వాత  ఆ విశ్వాసం దూరమైంది.ఋగ్వేద కాలానికన్నా ముందే మన దేశంలో గొప్ప నాగరికత విలసిల్లిందన్న సంగతి ఈ తవ్వకాలతో బహిర్గతమైంది.
  •  అందువల్ల మన దేశ చరిత్రకు సాహిత్య ఆధారంగా ఉన్న ఋగ్వేదం కన్నా హరప్పా,మొహంజొదారో నగర  అవశేషాలు మన చరిత్రకు ఆధారంగా ఉంటాయి.కానీ బ్రాహ్మణవాదులు మన చరిత్రకు ఋగ్వేదమే ఆధారం అంటున్నారు.       
    •  1992లొ  తవ్వకాలు జరిగేవరకు మన మన దేశంలో హరప్పా,మొహంజదారో పట్టణాల నాగరికత ఒకటి ఏర్పడింది అని ప్రపంచ ప్రజలు తెలుసుకోవడానికి వీలులేని విధంగా మనదేశ చారిత్రక ఆధారాలను నాశనం చేసిన ఆర్య,బ్రాహ్మణ,హిందూ మతవాదులు ఈనాడు ఋగ్వేదంలో సరస్వతి నాగరికతే,హరప్పా నాగరికత అని ప్రచారం చేస్తున్నారు.మన దేశ చరిత్రకు ఋగ్వేదాన్ని ఆధారంగా చూపిస్తున్నారు.
  1.       హరప్పా ప్రజలది నగరాలు నిర్మించిన చరిత్ర-నగరాలను ధ్వంసం చేసిన ఇంద్రుడు ఆర్యులు సృష్టించిన ఋగ్వేదంలో ప్రధాన దేవత.
  2.      హరప్పా  నాగరికత ప్రజలు స్థిర నివాసంలో ఉండగా-ఆర్యులు సంచార జాతిగా ఉన్నారు.నగరాలను స్థిర నివాసులు మాత్రమే నిర్మించగలరు.
  3.    హరప్పా నాగరికతను నిర్మించిన ప్రజల భాష వేరు-ఆర్యుల భాష వేరు.
  4.   హరప్పా ప్రజలది మాతృస్వామిక జీవన విధానం-ఆర్యులది పితృస్వామిక విధానం.
  5.   హరప్పా ప్రజలు అమ్మ దేవతలను పూజించారు-ఆర్యులు ఆకాశ దేవతలని పూజించారు.


                    హరప్పా  ఊసే లేకుండా వేద సాహిత్యాన్ని సృష్టించిన ఆర్య,బ్రాహ్మణ,హిందూ మతవాదులు ఈనాడు ఋగ్వేదంలోని సరస్వతి నాగరికతే హరప్పా నాగరికత అని ప్రచారం చేయడం ,హరప్పానాగరికతను నాశనం చేసాక సృష్టించిన ఋగ్వేదాన్ని మన దేశ చరిత్రకు ప్రధాన ఆధారంగా చెప్పడం వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి  పన్నిన కుట్రలో అంతర్భాగమే తప్ప మరొకటి కాజాలదు.






 

No comments:

Post a Comment