Thursday, September 29, 2011
Tuesday, August 16, 2011
క్రీస్తు జనానికి కారకులు ఎవరు?
![]() |
| చెరసాల |
![]() |
| పశువులశాల |
మ్లేచ్చుల పురాణం బైబిల్ యూరోపియన్ ఆర్యులకు మత గ్రంథం అయింది.క్రీస్తు భోధనలలో ఉన్న మ్లేచ్చ సంస్కారాన్ని ఆర్య సంస్కారానికి మార్చుకోవడానికి గ్రీకు,లాటిన్ పండితులు రెండున్నర శతాబ్దాలపాటు పరిశ్రమించారు.అలా మార్చుకొన్న తర్వాత ఆ మేథావులు క్రైస్తవ మతం స్వీకరించారు.
(వేల్పుల కథ ,పేజి.నం.15 ,రాంభట్ల కృష్ణమూర్తి )
మన దేశంలో ఆచారాలు,అలవాట్లు మత భావాలు ఆర్యుల ఆధిపత్యానికి ఆధారంగా మలుచుకున్న విధంగా క్రీస్తు మతం ఆర్య సంస్కారానికి అనుగుణంగా మలుచుకోబడిందని ఈ వివరణ తెలియజేస్తుంది.
బైబిల్ ఆధారంగా ఏర్పడిన మతం-యూదు,ఋగ్వేదం ఆధారంగా-వేద మతం
వేద మతంలో బ్రహ్మ-సరస్వతిలు భార్యాభర్తలు,యూదు మతంలో అబ్రహం,సారాలు భార్యాభర్తలు
వేద మతంకృష్ణుడిని సృష్టిస్తే,యూదు మతం క్రీస్తుని సృష్టించింది.
క్రీస్తుది యూదు జాతి కాగా కృష్ణుడిది యదు వంశం.
కృష్ణుడు వాసుదేవుడు ,క్రీస్తు యేసు దేవుడు.
కృష్ణుడు దైవ అవతారం,క్రీస్తు దైవ కుమారుడు.
కృష్ణుడు యోగమాయకు జన్మిస్తే,క్రీస్తు పరిశుద్ధ ఆత్మకు జన్మించాడు.
ఒకరు పుట్టింది చెరసాలలో,మరొకరు పుట్టింది పశువులశాలలో.
ఇద్దరు పుట్టినప్పుడూ ఆకాశంలో నక్షత్రాలు కనపడ్డాయి.
ఆ ప్రాంతంలో పాలక వర్గాలు ఇద్దరినీ పుట్టిన వెంటనే హత్య చేయడానికి ప్రయత్నించారు.
ఇద్దరూ పుట్టిన చోటు నుండి మరొకచోటికి మార్చబడ్డారు
అలా మార్చే కాలంలో ఇద్దరికీ నదులు దార్లు ఇచ్చాయి
ఒకరు ఆవుల కాపరి,మరొకరు పశువుల కాపరి
ఒకరి బోధ బైబిల్,మరొకరి బోధ భగవద్గీత.
గీతలో కృష్ణుడు 27 పేర్లతో పిలవబడ్డాడు,క్రీస్తు పేరుతో ఉన్న బైబిల్ గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయి.
చివరికి ఇద్దరూ చంపబడ్డారు.
కృష్ణుడు మరణించడంతో కలియుగం మొదలైంది,క్రీస్తు జననంతో క్రీస్తు శకం మొదలైంది.
ఇక్కడ ప్రధానంగా గమనించవలిసింది ఏంటంటే ....సెమిటిక్ జాతికి చెందిన క్రీస్తు జనన కథకి,ఆర్య జాతికి చెందిన కృష్ణుని జనన కథకు దగ్గర సంభందం ఉండటానికి కారణం ఏమిటి?అలాగే ఆది గ్రంథాల ప్రకారం కృష్ణుడు మరణించిన 3 ,101 సంవత్సరాలకు పుట్టిన క్రీస్తు జన్మ కథకు ఇంత దగ్గరి సంభంధం ఏంటి?దీని వెనుకే చరిత్రను కనుగొనడం ఆధారపడింది.
ఆర్యులు,సెమిటిక్ లు యూరప్ కి చెందినవారు అయినందున,కృష్ణుడి మరణ కాలం,క్రీస్తు జనన కాలాల మధ్య కాలం వారి చరిత్ర కాలం అయినందున కృష్ణుడు,క్రీస్తు కథలు మధ్య సామ్యాలు ఉన్నాయి.
రోమన్ సామ్రాజ్యం క్రీస్తుశకానికి క్రి.పూ.46 లోనే పునాది వేసింది.దీనికి న్యుమరాలజి ప్రకారం వాటికన్ సిటీ అంకెల విలువ 46 .(లిపి లేని కాలంలో ఆర్యులు తమ చరిత్రను సంఖ్యలలో భద్రపరిచారు.)
. క్రీస్తు పూర్వం 46కి ముందు యూరప్ లో పది నెలలకి ఒక సంవత్సరంగా భావించేవారు.యూరప్ వారి పది నెలలలో నాలుగిటి పేర్లు మన దేశ సంస్కృత భాషకు చెందిన పదాలతో ఉన్నాయి
ఎనిమిదవ నెల అష్ట+అంబర్ =అక్టోబర్
తొమ్మిదవ నెల నవ+అంబర్ =నవంబర్
పదవ నెల దశ+అంబర్= డిసంబర్
అప్పుడు జనవరి,ఫిబ్రవరి నెలలు లేవు.జూలియస్ సీజర్ ఈ రెండు నెలల్ని చేర్చి పన్నెండు నెలలు ఒక సంవత్సరంగా విభజించాడు.రోమన్ సామ్రాజ్యంలో పరస్పర విరుద్ద దిశలలో రెండు తలలతో ఉన్న జానస్ అనే దేవత పేరు మీద మొదటి నెల జనవరి అని నామం దాల్చింది.
జానస్ దేవత రెండు తలలు క్రీస్తు పూర్వాన్ని,క్రీస్తు శకాన్ని సూచిస్తున్నాయి.అంటే క్రీస్తు పూర్వమే క్రీస్తు అనే పాత్రని సృష్టించడానికి భీజం పడిందన్నమాట.
రోమన్ సామ్రాజ్యంలో పరస్పర విరుద్ద దిశలలో రెండు తలలతో ఉన్న జానస్ అనే దేవత పేరు మీద జనవరి అని నామం దాల్చింది.
జానస్ దేవత రెండు తలలు క్రీస్తు పూర్వాన్ని,క్రీస్తు శకాన్ని సూచిస్తున్నాయి.అంటే క్రీస్తు పూర్వమే క్రీస్తు అనే పాత్రని సృష్టించడానికి భీజం పడిందన్నమాట.
క్రీస్తుశకం ఎలా మొదలైంది అంటే:
- క్రీస్తుశకం 532లొ ఒక క్రీస్తు సన్యాసి క్రీస్తు పేరు మీద ఒక శకాన్ని ప్రవేశపెట్టాలని సూచించాడు.(అంటే క్రీస్తు జన్మించిన 532 సంవత్సరముల తర్వాత ).
- క్రీస్తు పుట్టిన సంవత్సరాన్ని క్రీస్తుశకం ఒకటిగా భావించాలి.
- క్రీస్తుశకం 816లొ చల్సాబిషప్లల మహాసభ దీనిని ఆమోదించి వాడుకలోకి తెచ్చింది .
- క్రీస్తుశకం 879లొ జర్మనీ చక్రవర్తి క్రీస్తు శకాన్ని ఆమోదించాడు.
క్రీస్తు జన్మదినం డిసెంబర్ 25 గా ఎలా నిర్ణయించారు:
క్రీస్తు పుట్టిన సంవత్సరాన్ని చరిత్రకారులు నిర్దారణ చేయలేకపోయారు.ఆయన పుట్టిన తేది నిర్ణయించగల ఆవకాశం కూడా చరిత్రలో ఎక్కడా లేకుండా పోయింది .ఆ పరిస్థితిలో రోమన్ ప్రజలు ప్రతి ఏట డిసెంబర్ 25న శాతర్నేలియా అనే పండుగను తిరునాలవలె జరుపుకొనే వారు .ఆ పండుగ రోజే క్రీస్తు జన్మించాడని ఒక మతసన్యాసి చెప్పాడని క్రీస్తు జన్మదినం కోసం పరిశోధించిన ఒక అమెరికన్ చరిత్రకారుడు తెలిపాడు .క్రీస్తు శకం పెట్టాలని చెప్పినవాడు , క్రీస్తు జన్మదినాన్ని ప్రకటించినవాడు ఒక్కడే .అంటే క్రీస్తు జన్మదినం క్రీస్తుశకం 532నుంచి ప్రారంభం అయ్యింది.క్రీస్తు మతం ఎలా పుట్టింది :
క్రీస్తు పూర్వం 73లొ స్పార్టకస్ నాయకత్వంలో బానిసల తిరుగుబాటు జరిగింది.ఇది ప్రపంచంలో జరిగిన తిరుగుబాట్లలో అతి పెద్దది.ఇదే కాలంలో రోమన్ సామ్రాజ్యపు రైతులలో కూడా విప్లవం మొదలైంది.ఈ దశలో రోమన్ సామ్రాజ్యంలో ధనవంతుల ఆస్తులకు ,వారి ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది .ఈ పరిస్థితిలో రోమన్ సామ్రాజ్యంలో క్రీస్తు కథల ప్రచారం ప్రారంభమైనది .ఆ సమయంలో తిరుగుబాటుదార్లు కూడా తమ తిరుగుబాటు పూర్తిగా సఫలం కాకపోవటం వల్ల కొంత నిరాశ,నిస్పృహలతో ఉన్నారు .
'ప్రాచీన ప్రపంచ చరిత్ర' గ్రంథం ప్రకారం:
పాలస్తీనాలో ఒక దేవుడు మామూలు మనిషి రూపంలో జీవిస్తున్నడనే వదంతులు మొదటి దశాబ్దంలో విరివిగా వ్యాపించాయి .బానిసల బాధలు ఉద్దరించడానికి ఆ దేవుడు భూమి మీద అవతరించాడని ప్రజలు అనుకునేవారు.అతనిపేరు క్రీస్తు అని, రోమ్ లో ఒక గవర్నర్ శిలువ వేసాడని,అతను మరణించిన తర్వాత పునరుత్థానం పొంది స్వర్గానికి పోయాడని అనుకునేవారు.అతను తిరిగి వచ్చి మానవుల ఆత్మలను విచారిస్తాడని ,తనని దేవునిగా గుర్తించిన వానికి సకల సౌఖ్యాలు ప్రసాదిస్తాడని ,ఇతరులకి అనంతమైన హింసను కలుగాజేస్తాడని ప్రజలు విశ్వసించేవారు .కాని అలాంటి వాడు ఎప్పుడూ లేడని చరిత్ర ఇప్పుడు ఋజువు చేసింది . అయితే క్రీస్తు సువార్తలను ప్రజలు పూర్తిగా నమ్మారు .వాళ్ళ బాధలకు పారితోషకం ,వాళ్ళను భాధించిన వారికి శిక్షను ఆ కథలు వాగ్థానం చేసాయి.
క్రైస్తవ మతం ఓర్పును ,విధేయతను భోదించి తద్వారా బానిసలను వారి యజమానుల మీద తిరుగుబాటు చేయకుండా పక్కదోవ పట్టించింది .క్రైస్తవ మతం చెడ్డ బానిసను మంచి బానిసగా మారుస్తుంది అని ఒక మతాచార్యుడు అన్నాడంటే దానిలో ఎంత లోతు అర్ధం ఉందొ గమనించారా? క్రైస్తవుల లో ధనవంతులు క్రైస్తవ సంఘాలకు విరాళాలు ఇచ్చేవారు.వారే మతాధిపతులను ఎన్నుకోనేవారు.ఆ ప్రాంతంలో క్రైస్తవులందరూ ఆ మతాధిపతుల చెప్పుచేతల్లో ఉండాలని వారి మత గ్రంథం ఉద్బోదిస్తుంది.
క్రీస్తు మతాన్ని ప్రారంభ కాలంలో రోమన్ సామ్రాజ్యం వ్యతిరేకించింది .
ఒక ఆఫ్రికా కవి రాసిన కవిత :
వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో
బైబిల్లు ,మా చేతిలో భూములు
తెలుపు నలుపులు దేవుడికి లేవు
కళ్ళు మూసుకొని ప్రార్ధన చేసుకొందాం రండి
అద్భుతం
మా కళ్ళు మూతబడ్డాయి
ఆశతో మా కళ్ళు విప్పినప్పుడు
వాళ్ళ చేతిల్లో భూములు ఉన్నాయి
మా చేతిల్లో బైబిల్లు ఉన్నాయి
Sunday, August 14, 2011
అంథకారం
హరప్పా నాగరికతతో మొదలుకావాల్సిన మన చరిత్ర ఆర్య గ్రంథం ఋగ్వేదంతో మొదలైంది.మన పూర్వీకుల నాగరికతను ధ్వంసం చేసి,చరిత్రలో వాటి ఆనవాళ్ళు కూడా లేకుండా చేసిన ఆర్యులు,మనవాళ్ళను బానిసలుగా మార్చిన ఆర్యులు,ఉత్తర భారతదేశంలోనే కాక దక్షిణ భారత దేశంలో కూడా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఋగ్వేదాన్ని రూపొందించారు.ఈ వేదాన్ని అడ్డుకొన్న అతి కొద్ది మందిని రాక్షసులుగా మార్చివేసారు.నేటికీ వారిని వారిని మనం రాక్షసులుగానే గుర్తించడం,పండగల సమయంలో మనవాళ్ళ ప్రతిమలను మనమే నాశనం చేయడం నిజంగా శోచనీయం.
. ఋగ్వేదం ఆధారంగా ఏర్పడిన వర్ణ వ్యవస్థతో మన దేశ జీవన విధానం మొదలైంది.వర్ణ వ్యవస్థలో నాలుగు వర్ణాలున్నాయి.నాలుగు వర్ణాలలో మూడు అగ్రవర్ణాలు,ఒకటి హీన వర్గం.ఋగ్వేదం సృష్టించిన కాలంనాటికి భారత ఉపఖండంలో ఆర్యులు,అనార్యులు అని రెండు జాతులు ఉన్నాయని ఋగ్వేదం చెబుతుంది.
ఆర్య త్రైవర్ణిక అన్న ఆర్య సూక్తి ప్రకారం ఆర్యులు మూడు వర్ణాలుగా విభజించబడ్డారు:
ఆర్య బ్రహ్మణ: అర్చకులుగా,న్యాయ వ్యవస్థ సంరక్షకులుగా వీరు తమ భాధ్యతను ప్రకటించుకున్నారు.
అర్యక్ష్యత్రియ : రాజకీయ,పాలనా సంబంధ వ్యవహారాలని వీరికి కేటాయించబడింది.ఈ లింక్ ని పరిశీలించండి
http://truthofhinduism.com/general/lord-rama-slays-an-innocent/ఆర్యవైశ్య :గోసంరక్షకులుగా ,వర్తకులుగా,భూస్వాములుగా వ్యవహరించడానికి వీరు నిర్ణయించుకున్నారు.
శూద్ర:.ఇది వర్ణ వ్యవస్థలో ఆఖరి వర్గం.పై మూడు వర్గాలకు సేవ చేయడం ఈ వర్గానికి కేటాయించబడింది.కూలీలుగా,వ్యవసాయ సంభందమైన కార్యకలాపాలు చేసేవారు. ఏ వృత్తి చేపట్టినా శూద్రులు పై
మూడు వర్గాలకు బానిసలుగా ఉండవలిసిందే.(వర్ణ వ్యవస్థ ప్రకారం).
పై మూడు వర్ణాలలాగే శూద్ర వర్ణానికి ముందు "ఆర్య" అనే పేరు ఎందుకు లేదు?ఆ వర్ణం కూడా ఋగ్వేదం సృష్టించిన వర్ణ వ్యవస్థలో భాగమే కదా?మరి ఎందుకు ఈ వ్యత్యాసం?ఎందుకంటే ఇది ఆర్యులచే రచించబడిన గ్రంథం కాబట్టి......వారి ఆధిపత్య సంరక్షణలో భాగం కాబట్టి......
కనుక ఈ శూద్రలే మన దేశమూలవాసులని మనం భావించాలి.
ఈ ఆర్యులే సమాజంలోని సమస్త రంగాల్లో ఆధిపత్యవాదులుగా ఉండి మూలవాసులను వివిధ కులాలుగా విభజించడం జరిగింది.వారు జాతీయ శక్తులుగా ఆవిర్భవించారు. మూడు అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఆమోదించిన మూలవాసులు ప్రాంతీయ శక్తులుగా మార్చారు.ఈ విధంగా ఇండో-యురోపెయన్ జాతైన ఆర్యులు ఇక్కడ ఆధిపత్యవాదులుగా వ్యవహరించసాగారు.ఈ కూలాలను సృష్టించి ఎవరికీ వారిని విడదీసి మూలవాసులకి చరిత్ర తెలియకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మనల్ని ఈ అంధకారంలో వదిలేసారు.
Saturday, August 13, 2011
మన దేశ చరిత్రకు ఆధారాలు
మన దేశ చరిత్ర హరప్పా నాగరికతతో ప్రారంభమైంది.హరప్పా నాగరికతలో లిపి ఏర్పడింది.కానీ మన దేశచరిత్రకు సాహిత్య ఆధారంగా ఆ కాలంలో లిపి లేని ఆర్యులు రాసిన ఋగ్వేదం ఉంది.ఇది ఎలా జరిగింది?
- కొత్త రాతి యుగ ప్రారంభ కాలంలో నైల్,టైగ్రిస్,సింధు నదీ ప్రాంతాలలో నాగరికత(నగరం),లిపులు రూపొందాయి అని చరిత్ర చెబుతుంది.
- అందువల్ల ఆ పట్టణ అవశేషాలు ఆ నాగరికతలో భాగంగా ఉన్నాయి.భారతీయ సాంప్రదాయకత-సంస్కృతి లో పి.ఆర్.రావు గారు ఈ కింది విధంగా చెప్పారు-
ఆర్యులు అడిగిడిన తర్వాతే భారతదేశంలో నాగరికత ప్రారంభమైందని విశ్వాసం కొంత కాలం ఉండేది.కానీ 1992లో ఆర్.డి.బెనర్జీ నాయకత్వంలో జరిగిన తవ్వకాలలో హరప్పా,మొహంజదారో పట్టణ అవశేషాలు బయటపడిన తర్వాత ఆ విశ్వాసం దూరమైంది.ఋగ్వేద కాలానికన్నా ముందే మన దేశంలో గొప్ప నాగరికత విలసిల్లిందన్న సంగతి ఈ తవ్వకాలతో బహిర్గతమైంది.
- అందువల్ల మన దేశ చరిత్రకు సాహిత్య ఆధారంగా ఉన్న ఋగ్వేదం కన్నా హరప్పా,మొహంజొదారో నగర అవశేషాలు మన చరిత్రకు ఆధారంగా ఉంటాయి.కానీ బ్రాహ్మణవాదులు మన చరిత్రకు ఋగ్వేదమే ఆధారం అంటున్నారు.
- 1992లొ తవ్వకాలు జరిగేవరకు మన మన దేశంలో హరప్పా,మొహంజదారో పట్టణాల నాగరికత ఒకటి ఏర్పడింది అని ప్రపంచ ప్రజలు తెలుసుకోవడానికి వీలులేని విధంగా మనదేశ చారిత్రక ఆధారాలను నాశనం చేసిన ఆర్య,బ్రాహ్మణ,హిందూ మతవాదులు ఈనాడు ఋగ్వేదంలో సరస్వతి నాగరికతే,హరప్పా నాగరికత అని ప్రచారం చేస్తున్నారు.మన దేశ చరిత్రకు ఋగ్వేదాన్ని ఆధారంగా చూపిస్తున్నారు.
- హరప్పా ప్రజలది నగరాలు నిర్మించిన చరిత్ర-నగరాలను ధ్వంసం చేసిన ఇంద్రుడు ఆర్యులు సృష్టించిన ఋగ్వేదంలో ప్రధాన దేవత.
- హరప్పా నాగరికత ప్రజలు స్థిర నివాసంలో ఉండగా-ఆర్యులు సంచార జాతిగా ఉన్నారు.నగరాలను స్థిర నివాసులు మాత్రమే నిర్మించగలరు.
- హరప్పా నాగరికతను నిర్మించిన ప్రజల భాష వేరు-ఆర్యుల భాష వేరు.
- హరప్పా ప్రజలది మాతృస్వామిక జీవన విధానం-ఆర్యులది పితృస్వామిక విధానం.
- హరప్పా ప్రజలు అమ్మ దేవతలను పూజించారు-ఆర్యులు ఆకాశ దేవతలని పూజించారు.
హరప్పా ఊసే లేకుండా వేద సాహిత్యాన్ని సృష్టించిన ఆర్య,బ్రాహ్మణ,హిందూ మతవాదులు ఈనాడు ఋగ్వేదంలోని సరస్వతి నాగరికతే హరప్పా నాగరికత అని ప్రచారం చేయడం ,హరప్పానాగరికతను నాశనం చేసాక సృష్టించిన ఋగ్వేదాన్ని మన దేశ చరిత్రకు ప్రధాన ఆధారంగా చెప్పడం వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పన్నిన కుట్రలో అంతర్భాగమే తప్ప మరొకటి కాజాలదు.
చరిత్ర ప్రాధాన్యత
మన దేశ చరిత్ర రచన ఆర్య సంస్కృతితో ప్రారంభమైంది.అంటే ఆర్య సంస్కృతి కన్నా ముందు సంస్కృతి చరిత్రలో పేర్కొనబడలేదు .ఆర్య సంస్కృతిని ఆధారంగా చేసుకున్న చరిత్రలో మూలవాసులకు స్థానం లేకుండా చేయబడింది.ప్రపంచ చరిత్రలోను,మన దేశ చరిత్రలోను ప్రధాన పాత్ర వహించిన ఆర్యుల చరిత్ర విభిన్న కథనాలతో ప్రచారంలో ఉన్నందున ఏది వాస్తవమో నిర్దారించుకోలేని పరిస్థితి మూలవాసులకు కల్పించబడింది.గత చరిత్రను ఆధారం చేసుకొని నేటి చరిత్ర,నేటి చరిత్రను ఆధారంగా చేసుకొని రేపటి చరిత్ర రూపొందుతుంది అని సామాజిక శాస్త్రం తెలియజేస్తుంది.కానీ ఈనాటికి మన దేశ సమాజ జీవన చరిత్రను మూలవాసులు తెలుసుకోలేని స్థితిలోనే ఉన్నారు. .
సమాజంలో నూటికి పదిమందిలోపు ఉన్న అగ్రవర్ణాలవారు చరిత్రలో అన్ని కాలాల్లోను ప్రధాన పాత్ర వహించడం,నూటికి తొంభై మందికి పైగా ఉన్న మూలవాసులు చరిత్రలో అప్రధానులుగా ఉన్నవిధానం చరిత్రను ప్రజలు నిర్మించలేదని స్వార్థపర,దోపిడీ వర్గాలు చరిత్రను తమ ఆధిపత్యానికి అనుకూలంగా మార్చుకున్నాయని అర్ధం అవుతుంది.ఈ ధోరణి మన దేశానికీ మాత్రమే పరిమితం కాలేదు.మన దేశంలో మూడు అగ్రవర్ణాలు గతకాలం నుండి ఈనాటి వరకు వంశపారంపర్యంగా ఆధిపత్యవాదులుగా ఆవిర్భవిస్తున్న విధంగానే పశ్చిమ యూరప్ లోని ప్రభు వర్గం,తూర్పు యూరప్ లోని కులీన వర్గం,మధ్య ఆసియా లోని మతాధిపతులు,బానిస భూస్వామ్య పారిశ్రామిక సమాజాల్లో వంశపారంపర్యంగా ఆధిపత్యవాదులుగా కొనసాగుతూ ఆయా ప్రాంత చరిత్రలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు.బౌద్ధ తత్త్వం ప్రకారం ఈనాటి సమాజం ఇలా ఉండటానికి కారణం రెండు ఖండాలలోనూ గత కాలం నుండి ఈనాటి వరకు వంశపారంపర్యంగా ఆధిపత్యవాదులుగా ఆవిర్భవిస్తున్నవారే కారణం.కానీ చరిత్ర గ్రంథాలు అలా తెలియజేయడం లేదు.ప్రపంచంలో లక్షలాది చరిత్ర గ్రంథాలు ఉన్నాయి.కానీ ఏ ఒక్క చరిత్ర గ్రంథం కూడా మనదేశంలోని ఆర్యుల,అనార్యుల చరిత్ర తొలి నాగరికత నిర్మాతల చరిత్ర తెలిజేయలేకపోవడానికి కారణం ఏమిటి? ప్రపంచ ఆది గ్రంథాలుగా ప్రాచుర్యంలో ఉన్న ఋగ్వేదం,పాత నిభందనల బైబిల్ గ్రంథాలు ప్రపంచ ప్రజల చరిత్ర అంతా జాతుల పోరాట చరిత్ర అని తెలియజేస్తుంటే ఆధునిక విజ్ఞానాన్ని ఆధారం చేసుకున్న చరిత్ర గ్రంథాలు ప్రపంచప్రజల చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర అని,ప్రపంచ చరిత్రను ఆర్ధిక కోణంలో పరిశీలించి తెలియజేస్తున్నందున మనం చదువుతున్న చరిత్రలో జాతుల పోరాట చరిత్రలు లేవు.అందువలనరెండు ఖండాలలోనూ గత కాలం నుండి ఈనాటి వరకు వంశపారంపర్యంగా ఆధిపత్యవాదులుగా ఉన్నవారి చరిత్రను మనం తెలుసుకోలేకపోతున్నాం.జాతుల చరిత్రలు తెలియనందున వర్గ పోరాట చరిత్రను విశ్వసిస్తున్నాం.
Subscribe to:
Posts (Atom)

















