Tuesday, August 16, 2011

క్రీస్తు జనానికి కారకులు ఎవరు?చెరసాల 
 పశువులశాల
కృష్ణుడు,క్రీస్తు ఇద్దరూ చారిత్రక వ్యక్తులు కాదు.అంతర్జాతీయ ఆర్యులు సృష్టించిన కల్పిత పాత్రలు.కల్పిత పాత్రలైనా ప్రపంచప్రజలు వారిని దైవంగా పూజిస్తారు.అంటే అసత్యాన్ని,సత్యమని నమ్ముతున్నారు.ప్రపంచ మతాలన్నీ అసత్యాన్ని సత్యమని ప్రచారం చేస్తున్నాయి. రకంగా ప్రపంచ ప్రజలంతా అసత్యాన్ని ఆరాధిస్తూ జీవించే పరిస్థితిని కల్పించాయి మాతాలు.              
          
                మ్లేచ్చుల పురాణం బైబిల్  యూరోపియన్ ఆర్యులకు మత గ్రంథం అయింది.క్రీస్తు భోధనలలో ఉన్న మ్లేచ్చ సంస్కారాన్ని ఆర్య సంస్కారానికి మార్చుకోవడానికి గ్రీకు,లాటిన్ పండితులు రెండున్నర శతాబ్దాలపాటు పరిశ్రమించారు.అలా మార్చుకొన్న తర్వాత మేథావులు క్రైస్తవ మతం స్వీకరించారు.
            (వేల్పుల కథ ,పేజి.నం.15 ,రాంభట్ల కృష్ణమూర్తి )
మన దేశంలో ఆచారాలు,అలవాట్లు మత భావాలు ఆర్యుల ఆధిపత్యానికి ఆధారంగా మలుచుకున్న విధంగా క్రీస్తు మతం ఆర్య సంస్కారానికి అనుగుణంగా మలుచుకోబడిందని వివరణ తెలియజేస్తుంది.


  బైబిల్ ఆధారంగా ఏర్పడిన మతం-యూదు,ఋగ్వేదం ఆధారంగా-వేద మతం


  వేద మతంలో బ్రహ్మ-సరస్వతిలు భార్యాభర్తలు,యూదు మతంలో అబ్రహం,సారాలు భార్యాభర్తలు
     వేద మతంకృష్ణుడిని సృష్టిస్తే,యూదు మతం క్రీస్తుని సృష్టించింది.
  క్రీస్తుది యూదు జాతి కాగా  కృష్ణుడిది యదు వంశం.
 కృష్ణుడు వాసుదేవుడు ,క్రీస్తు యేసు దేవుడు.
   కృష్ణుడు దైవ అవతారం,క్రీస్తు దైవ కుమారుడు.
  కృష్ణుడు యోగమాయకు జన్మిస్తే,క్రీస్తు పరిశుద్ధ ఆత్మకు జన్మించాడు.
 ఒకరు పుట్టింది చెరసాలలో,మరొకరు పుట్టింది పశువులశాలలో.
ఇద్దరు పుట్టినప్పుడూ ఆకాశంలో నక్షత్రాలు కనపడ్డాయి.
  ప్రాంతంలో పాలక వర్గాలు ఇద్దరినీ పుట్టిన వెంటనే హత్య చేయడానికి ప్రయత్నించారు.
  ఇద్దరూ పుట్టిన చోటు నుండి మరొకచోటికి మార్చబడ్డారు
  అలా మార్చే కాలంలో ఇద్దరికీ నదులు దార్లు ఇచ్చాయి
 ఒకరు ఆవుల కాపరి,మరొకరు పశువుల  కాపరి
 ఒకరి బోధ బైబిల్,మరొకరి బోధ భగవద్గీత.
  గీతలో కృష్ణుడు 27 పేర్లతో పిలవబడ్డాడు,క్రీస్తు పేరుతో ఉన్న బైబిల్  గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయి.
 చివరికి ఇద్దరూ చంపబడ్డారు.
  కృష్ణుడు మరణించడంతో  కలియుగం మొదలైంది,క్రీస్తు జననంతో క్రీస్తు శకం మొదలైంది.


       ఇక్కడ ప్రధానంగా గమనించవలిసింది ఏంటంటే ....సెమిటిక్ జాతికి చెందిన క్రీస్తు జనన కథకి,ఆర్య జాతికి చెందిన కృష్ణుని జనన కథకు దగ్గర సంభందం ఉండటానికి కారణం ఏమిటి?అలాగే ఆది గ్రంథాల ప్రకారం కృష్ణుడు మరణించిన 3 ,101 సంవత్సరాలకు పుట్టిన క్రీస్తు జన్మ  కథకు ఇంత దగ్గరి సంభంధం ఏంటి?దీని వెనుకే  చరిత్రను కనుగొనడం  ఆధారపడింది.
           ఆర్యులు,సెమిటిక్ లు యూరప్ కి చెందినవారు  అయినందున,కృష్ణుడి మరణ కాలం,క్రీస్తు జనన కాలాల మధ్య కాలం వారి చరిత్ర కాలం అయినందున కృష్ణుడు,క్రీస్తు కథలు మధ్య సామ్యాలు ఉన్నాయి.


   రోమన్ సామ్రాజ్యం క్రీస్తుశకానికి  క్రి.పూ.46 లోనే పునాది వేసింది.దీనికి న్యుమరాలజి ప్రకారం వాటికన్ సిటీ అంకెల విలువ 46 .(లిపి లేని కాలంలో ఆర్యులు తమ చరిత్రను సంఖ్యలలో భద్రపరిచారు.)
.       క్రీస్తు పూర్వం 46కి ముందు యూరప్ లో పది నెలలకి ఒక సంవత్సరంగా భావించేవారు.యూరప్ వారి పది నెలలలో నాలుగిటి పేర్లు మన దేశ సంస్కృత భాషకు చెందిన పదాలతో ఉన్నాయి
                                 ఏడవ నెల సప్త+అంబర్ = సెప్టెంబర్
                           ఎనిమిదవ నెల  అష్ట+అంబర్ =అక్టోబర్
                          తొమ్మిదవ నెల   నవ+అంబర్ =నవంబర్
                           పదవ నెల          దశ+అంబర్= డిసంబర్
   అప్పుడు జనవరి,ఫిబ్రవరి నెలలు లేవు.జూలియస్ సీజర్ రెండు నెలల్ని  చేర్చి పన్నెండు నెలలు ఒక సంవత్సరంగా విభజించాడు.రోమన్ సామ్రాజ్యంలో పరస్పర విరుద్ద దిశలలో రెండు తలలతో ఉన్న జానస్ అనే దేవత పేరు మీద మొదటి నెల జనవరి అని నామం దాల్చింది.
                                      జనవరి అంకెల విలువ 27 ,విలువ 9
                                       క్రీస్తు శకానికి 3114  అంకెల విలువ 9 .
                 జానస్ దేవత రెండు తలలు క్రీస్తు పూర్వాన్ని,క్రీస్తు శకాన్ని సూచిస్తున్నాయి.అంటే క్రీస్తు పూర్వమే క్రీస్తు  అనే పాత్రని సృష్టించడానికి భీజం పడిందన్నమాట.
రోమన్ సామ్రాజ్యంలో పరస్పర విరుద్ద దిశలలో రెండు తలలతో ఉన్న జానస్ అనే దేవత పేరు మీద జనవరి అని నామం దాల్చింది.
                                      జనవరి అంకెల విలువ 27 ,దాని విలువ 9
                                       క్రీస్తు శకానికి 3114  అంకెల విలువ 9 .
                 జానస్ దేవత రెండు తలలు క్రీస్తు పూర్వాన్ని,క్రీస్తు శకాన్ని సూచిస్తున్నాయి.అంటే క్రీస్తు పూర్వమే క్రీస్తు  అనే పాత్రని సృష్టించడానికి భీజం పడిందన్నమాట.
క్రీస్తుశకం ఎలా మొదలైంది అంటే: 
 •    క్రీస్తుశకం 532లొ ఒక క్రీస్తు సన్యాసి క్రీస్తు పేరు మీద ఒక శకాన్ని ప్రవేశపెట్టాలని సూచించాడు.(అంటే క్రీస్తు జన్మించిన 532 సంవత్సరముల తర్వాత ).
 •  క్రీస్తు పుట్టిన  సంవత్సరాన్ని  క్రీస్తుశకం ఒకటిగా  భావించాలి.
 •  క్రీస్తుశకం 816లొ  చల్సాబిషప్ల  మహాసభ  దీనిని  ఆమోదించి  వాడుకలోకి  తెచ్చింది .
 •  క్రీస్తుశకం 879లొ జర్మనీ చక్రవర్తి  క్రీస్తు శకాన్ని ఆమోదించాడు.
      అంటే క్రీస్తు అనబడే వ్యక్తికీ తనుకు  ఒక మతం ఉందని,తన పేరుతో ఒక శకం మొదలవుతుందని  తెలియదన్నమాట పాపం.
  క్రీస్తు జన్మదినం డిసెంబర్ 25 గా ఎలా నిర్ణయించారు:
   క్రీస్తు  పుట్టిన   సంవత్సరాన్ని  చరిత్రకారులు నిర్దారణ చేయలేకపోయారు.ఆయన పుట్టిన   తేది నిర్ణయించగల ఆవకాశం కూడా చరిత్రలో ఎక్కడా లేకుండా   పోయింది  .   పరిస్థితిలో  రోమన్  ప్రజలు   ప్రతి  ఏట   డిసెంబర్ 25న శాతర్నేలియా  అనే  పండుగను  తిరునాలవలె  జరుపుకొనే  వారు . పండుగ రోజే  క్రీస్తు జన్మించాడని  ఒక మతసన్యాసి   చెప్పాడని క్రీస్తు జన్మదినం కోసం పరిశోధించిన ఒక అమెరికన్ చరిత్రకారుడు తెలిపాడు .క్రీస్తు  శకం  పెట్టాలని  చెప్పినవాడు , క్రీస్తు జన్మదినాన్ని  ప్రకటించినవాడు ఒక్కడే .అంటే  క్రీస్తు జన్మదినం క్రీస్తుశకం 532నుంచి ప్రారంభం అయ్యింది.


 క్రీస్తు మతం   ఎలా పుట్టింది :
 క్రీస్తు  పూర్వం 73లొ  స్పార్టకస్  నాయకత్వంలో బానిసల తిరుగుబాటు జరిగింది.ఇది ప్రపంచంలో జరిగిన తిరుగుబాట్లలో   అతి పెద్దది.ఇదే కాలంలో రోమన్ సామ్రాజ్యపు రైతులలో కూడా విప్లవం మొదలైంది.ఈ   దశలో  రోమన్ సామ్రాజ్యంలో  ధనవంతుల  ఆస్తులకు ,వారి  ప్రాణాలకు  రక్షణ  లేని  పరిస్థితి  ఏర్పడింది .ఈ  పరిస్థితిలో  రోమన్  సామ్రాజ్యంలో  క్రీస్తు కథల   ప్రచారం  ప్రారంభమైనది . సమయంలో   తిరుగుబాటుదార్లు  కూడా  తమ  తిరుగుబాటు  పూర్తిగా  సఫలం  కాకపోవటం  వల్ల కొంత  నిరాశ,నిస్పృహలతో  ఉన్నారు .


'ప్రాచీన  ప్రపంచ  చరిత్ర' గ్రంథం ప్రకారం:

                        పాలస్తీనాలో  ఒక దేవుడు మామూలు    మనిషి   రూపంలో జీవిస్తున్నడనే వదంతులు   మొదటి దశాబ్దంలో   విరివిగా  వ్యాపించాయి  .బానిసల బాధలు  ఉద్దరించడానికి   దేవుడు భూమి  మీద  అవతరించాడని ప్రజలు అనుకునేవారు.అతనిపేరు  క్రీస్తు    అని, రోమ్ లో ఒక గవర్నర్ శిలువ వేసాడని,అతను మరణించిన తర్వాత పునరుత్థానం   పొంది   స్వర్గానికి    పోయాడని అనుకునేవారు.అతను తిరిగి వచ్చి మానవుల ఆత్మలను విచారిస్తాడని   ,తనని దేవునిగా గుర్తించిన వానికి  సకల సౌఖ్యాలు ప్రసాదిస్తాడని  ,ఇతరులకి అనంతమైన  హింసను కలుగాజేస్తాడని ప్రజలు విశ్వసించేవారు  .కాని అలాంటి వాడు ఎప్పుడూ లేడని చరిత్ర ఇప్పుడు  ఋజువు  చేసింది . అయితే క్రీస్తు  సువార్తలను ప్రజలు పూర్తిగా  నమ్మారు .వాళ్ళ  బాధలకు  పారితోషకం ,వాళ్ళను  భాధించిన వారికి  శిక్షను   కథలు వాగ్థానం  చేసాయి.
  క్రైస్తవ  మతం ఓర్పును ,విధేయతను   భోదించి  తద్వారా  బానిసలను వారి  యజమానుల  మీద తిరుగుబాటు చేయకుండా పక్కదోవ  పట్టించింది .క్రైస్తవ  మతం చెడ్డ బానిసను   మంచి  బానిసగా మారుస్తుంది అని  ఒక మతాచార్యుడు అన్నాడంటే  దానిలో  ఎంత  లోతు అర్ధం ఉందొ  గమనించారా? క్రైస్తవుల లో ధనవంతులు  క్రైస్తవ సంఘాలకు  విరాళాలు  ఇచ్చేవారు.వారే మతాధిపతులను ఎన్నుకోనేవారు. ప్రాంతంలో క్రైస్తవులందరూ మతాధిపతుల  చెప్పుచేతల్లో  ఉండాలని వారి మత గ్రంథం ఉద్బోదిస్తుంది.
                           క్రీస్తు మతాన్ని ప్రారంభ కాలంలో రోమన్ సామ్రాజ్యం  వ్యతిరేకించింది .క్రీస్తుమతస్తుల్ని  అనేక  భాధలు  పెట్టేవారు . ఎందుకంటే  రోమన్ సామ్రాజ్యాన్ని  వ్యతిరేకిస్తున్న  తిరుగుబాటుదార్లు  శాంతివాదులుగా    మారి ,క్రీస్తు మత బందీలుగా  ఉండడం   కోసమే  రోమన్   సామ్రాజ్యం ప్రారంభంలో  మతం మీద శత్రుత్వం    వహించింది .అంటే రోమన్ సామ్రాజ్యరక్షణ   కోసం  క్రీస్తు  మతం సృష్టించబడింది .క్రీస్తు యూదు జాతిలో   పుట్టాడని ,అతను యూదుల  దేవుడని  ప్రచారం   చేసారు .కాని క్రీస్తుని  యూదులు  దేవుడుగా    ఆమోదించలేదు .అంటే తన  జాతికి  దేవుడు కాదు  గానీ ప్రపంచ  రక్షకుడు  అన్నమాట.


 ఒక ఆఫ్రికా  కవి  రాసిన  కవిత :
            వాళ్ళు  వచ్చినప్పుడు  వాళ్ళ చేతిలో 
           బైబిల్లు ,మా  చేతిలో భూములు 
          తెలుపు  నలుపులు  దేవుడికి  లేవు 
          కళ్ళు  మూసుకొని  ప్రార్ధన  చేసుకొందాం  రండి 
         అద్భుతం
            మా కళ్ళు మూతబడ్డాయి 
           ఆశతో    మా కళ్ళు విప్పినప్పుడు 
          వాళ్ళ చేతిల్లో  భూములు  ఉన్నాయి 
 మా చేతిల్లో బైబిల్లు ఉన్నాయి
            

22 comments:

 1. ఇందులో చాలా విషయాలు అసంబద్ధంగా పొంతన లేకుండా రాశారు. మళ్ళీ మీరు రాసింది ఇంకో సారి చదవండి.

  ReplyDelete
  Replies
  1. మళ్ళి చదవాల్సినంత ఆలోచించకుండా రాయం సర్. అసంబద్దత ఏంటో చెప్పగలరు

   Delete
 2. అయ్యో... ఒకటి ప్రారంభించి మరొకటి ముగించారే.. క్రీస్తు గూర్చి తెలిసీ తెలియని రీతిలో వ్రాస్తున్నానని చెప్పకనే చెప్పారే..

  ReplyDelete
  Replies
  1. దేనితో ప్రారంభించాను...? దేనితో ముగించాను...?

   Delete
 3. There is historical evidence to birth of Jesus Christ, but no historical evident to Krishna.

  ReplyDelete
  Replies
  1. https://m.youtube.com/watch?v=JhCwx6PaaUU

   Delete
  2. See this evidence mr nicolson

   Delete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. ఎవరికి తోచింది వారు రాయచ్చు సాక్షానికి వారిద్దరు రారు కదా

  ReplyDelete
  Replies
  1. అవును..నాకూ అదే బాధగా ఉంది. వారిద్దరూ ఉండి ఉంటే తేలిపొయేది. కానీ ఏం చేస్తాం...కష్టపడకుండా సంపాదించుకొవడానికి వారి పేర్లు ఉపయొగించుకుంటున్నా, చూస్తూ ఊరుకోవటం తప్ప వాళ్ళు ఏం చేయగలరు పాపం ?

   Delete
 6. ఆర్య సిద్ధాంతం తప్పని తేల్చారు కదా.. మీరింకా అదే పట్టుకొని ఊగుతున్నారు...

  ReplyDelete
  Replies
  1. ఆర్య సిద్ధాంతం తప్పని తేల్చిన ఆ ఆర్యుడు ఎవరు సార్ ?
   నేను వినలేదు ఎవరని....

   Delete
  2. చాలా రోజుల తర్వాత రాస్తున్నాను..నేను నిజం తెలుసు కోవాలనే రాస్తున్నాను.ఆర్య సిద్దాంతాన్ని అంబేద్కరే నమ్మకలేదని విన్నాను(కొన్ని బ్లాగులలో చదివాను).అది బ్రిటిష్ వారే కల్పితంచారని(మాక్స్ ముల్లర్)చదివాను.

   Delete
  3. (ఓ బ్లాగు నుంచి కాపి/పేస్ట్)
   నిమ్నవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన డా అంబేద్కర్ మాత్రం ఆర్య సిద్ధాంతం తప్పని మరీ మరీ గట్టిగా చెప్పారు. డా.అంబెద్కర్ 'శూద్రులు ఎవరు ' అనే పుస్తకం లో ఇలా వ్రాసారు .
   ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం విదేశీ చరిత్ర కారులు కుట్ర తో వెలుగులోకి తెచ్చారు.ఋగ్వేదంలో 33 చోట్ల ఆర్య ప్రస్తావన వస్తుంది.అయితే ఆ శబ్దం జాతివాచకంగా వాడలేదు.

   Delete
  4. నేనెందుకు ఆర్య సిద్ధాంతం మీద పడ్డానంటే..మన దేశంలో ఆర్యా సిద్ధాంతం మీద జరిగినంత జరుగుతున్నంత రగడ వేరే సిద్ధాంతం మీద జరగలేదు. కులాలకి సంబందించి జరుగుతున్న గొడవలకి మూలం అదే.ఎన్ని పుస్తకాలు వచ్చాయో అందులో కల్పితాలు ఊహలు కొన్ని నిజాలూ కొంత స్వార్థం.మనం మన చరిత్రని సరిగ్గానే తెలుసుకుంటున్నామా లేదా అనే భయం.

   Delete
 7. ఎవరికి తోచింది వారు వ్రాసి దాన్నే సత్యమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్రాతలకు గల ఆధారాలు ఏంటి? ఏ విధమైన ప్రరిశోధనలు జరిపారు? ఏ పురావస్తు పరీక్షలు జరిపారు? ఆర్యులైన, యూదులైన వారి పూర్వాపరాల సంగతేంటి? వారి మతాలకు గల ఆధారాలను చులకనగా రూడిపరచు కోకుండా వ్రాయటంలో 'జ్ఞానం' ఉందా?

  ReplyDelete
 8. ఎవరికి తోచింది వారు వ్రాసి దాన్నే సత్యమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్రాతలకు గల ఆధారాలు ఏంటి? ఏ విధమైన ప్రరిశోధనలు జరిపారు? ఏ పురావస్తు పరీక్షలు జరిపారు? ఆర్యులైన, యూదులైన వారి పూర్వాపరాల సంగతేంటి? వారి మతాలకు గల ఆధారాలను చులకనగా రూడిపరచు కోకుండా వ్రాయటంలో 'జ్ఞానం' ఉందా?

  ReplyDelete
 9. ఇది రాసిన రచయతకు యూదుల చరిత్ర తెలుసా అసలు ఎప్పుడైనా క్రీస్తు పుట్టిన ప్రాంతాలకి వెళ్ళారా పరిశిలన చేసారా ఆధారాలు లేని విషయాలు ఎవరికీ తోసిందే వారు వ్రాయడమేన క్రీస్తు పుట్టిన దినం లేదని మీకు ఎవరు చెప్పారు సెప్టెంబర్ 15 అయన పుట్టారు డిసెంబర్ 25 నా క్రీస్తు దినంగా మార్చిండి ఎవరో మీకు తెలియక ఒక క్రిస్టవ సన్యాసి అన్నారూ అయన పేరు ఏమిటి పూర్తిగా పరిశోధన చేసి వ్యాసం రాయండి

  ReplyDelete
 10. ఇది రాసిన రచయతకు యూదుల చరిత్ర తెలుసా అసలు ఎప్పుడైనా క్రీస్తు పుట్టిన ప్రాంతాలకి వెళ్ళారా పరిశిలన చేసారా ఆధారాలు లేని విషయాలు ఎవరికీ తోసిందే వారు వ్రాయడమేన క్రీస్తు పుట్టిన దినం లేదని మీకు ఎవరు చెప్పారు సెప్టెంబర్ 15 అయన పుట్టారు డిసెంబర్ 25 నా క్రీస్తు దినంగా మార్చిండి ఎవరో మీకు తెలియక ఒక క్రిస్టవ సన్యాసి అన్నారూ అయన పేరు ఏమిటి పూర్తిగా పరిశోధన చేసి వ్యాసం రాయండి

  ReplyDelete
 11. జలప్రళయం తరువాత మిగిలిన వారి పేరు? ఏ మతం ఉంది? సార్...

  ReplyDelete
 12. జలప్రళయం తరువాత మిగిలిన వారి పేరు? ఏ మతం ఉంది? సార్...

  ReplyDelete
 13. చక్కటి వ్యాసం .సత్యాన్ని సత్యంగా చెప్పిన వివేకి మీరు ..చారిత్రక లోతులు అందులో గల గల కుట్రను బయట పెట్టారు ..

  ReplyDelete