Sunday, August 14, 2011

అంథకారం

        హరప్పా నాగరికతతో మొదలుకావాల్సిన మన చరిత్ర  ఆర్య గ్రంథం ఋగ్వేదంతో మొదలైంది.మన పూర్వీకుల నాగరికతను ధ్వంసం చేసి,చరిత్రలో వాటి ఆనవాళ్ళు కూడా లేకుండా చేసిన ఆర్యులు,మనవాళ్ళను బానిసలుగా మార్చిన ఆర్యులు,ఉత్తర భారతదేశంలోనే కాక దక్షిణ భారత దేశంలో కూడా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఋగ్వేదాన్ని రూపొందించారు.ఈ వేదాన్ని అడ్డుకొన్న అతి కొద్ది మందిని రాక్షసులుగా మార్చివేసారు.నేటికీ వారిని వారిని మనం రాక్షసులుగానే గుర్తించడం,పండగల సమయంలో మనవాళ్ళ  ప్రతిమలను మనమే నాశనం చేయడం నిజంగా శోచనీయం.

    .         ఋగ్వేదం ఆధారంగా ఏర్పడిన వర్ణ వ్యవస్థతో మన దేశ జీవన విధానం మొదలైంది.వర్ణ వ్యవస్థలో నాలుగు వర్ణాలున్నాయి.నాలుగు వర్ణాలలో మూడు అగ్రవర్ణాలు,ఒకటి హీన వర్గం.ఋగ్వేదం సృష్టించిన కాలంనాటికి భారత ఉపఖండంలో ఆర్యులు,అనార్యులు అని రెండు జాతులు  ఉన్నాయని ఋగ్వేదం చెబుతుంది.
   ఆర్య త్రైవర్ణిక   అన్న ఆర్య సూక్తి ప్రకారం ఆర్యులు మూడు వర్ణాలుగా విభజించబడ్డారు:

ఆర్య బ్రహ్మణ:   అర్చకులుగా,న్యాయ వ్యవస్థ సంరక్షకులుగా వీరు తమ భాధ్యతను ప్రకటించుకున్నారు.
అర్యక్ష్యత్రియ : రాజకీయ,పాలనా సంబంధ వ్యవహారాలని వీరికి కేటాయించబడింది.ఈ లింక్ ని పరిశీలించండి
http://truthofhinduism.com/general/lord-rama-slays-an-innocent/
ఆర్యవైశ్య :గోసంరక్షకులుగా ,వర్తకులుగా,భూస్వాములుగా వ్యవహరించడానికి వీరు నిర్ణయించుకున్నారు.




 శూద్ర:.ఇది వర్ణ వ్యవస్థలో ఆఖరి వర్గం.పై మూడు వర్గాలకు సేవ చేయడం ఈ వర్గానికి కేటాయించబడింది.కూలీలుగా,వ్యవసాయ సంభందమైన కార్యకలాపాలు చేసేవారు. ఏ వృత్తి చేపట్టినా శూద్రులు పై

మూడు వర్గాలకు బానిసలుగా ఉండవలిసిందే.(వర్ణ వ్యవస్థ ప్రకారం).


            పై మూడు వర్ణాలలాగే శూద్ర వర్ణానికి ముందు "ఆర్య" అనే పేరు ఎందుకు లేదు?ఆ వర్ణం కూడా ఋగ్వేదం సృష్టించిన వర్ణ వ్యవస్థలో భాగమే కదా?మరి ఎందుకు ఈ వ్యత్యాసం?ఎందుకంటే  ఇది ఆర్యులచే రచించబడిన గ్రంథం కాబట్టి......వారి ఆధిపత్య సంరక్షణలో భాగం కాబట్టి......
      కనుక ఈ శూద్రలే మన దేశమూలవాసులని మనం భావించాలి.

             ఈ ఆర్యులే సమాజంలోని సమస్త రంగాల్లో ఆధిపత్యవాదులుగా ఉండి మూలవాసులను వివిధ కులాలుగా విభజించడం జరిగింది.వారు జాతీయ శక్తులుగా ఆవిర్భవించారు.  మూడు అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఆమోదించిన మూలవాసులు ప్రాంతీయ శక్తులుగా మార్చారు.ఈ విధంగా ఇండో-యురోపెయన్ జాతైన ఆర్యులు ఇక్కడ ఆధిపత్యవాదులుగా వ్యవహరించసాగారు.ఈ కూలాలను సృష్టించి ఎవరికీ వారిని విడదీసి మూలవాసులకి చరిత్ర తెలియకుండా  తగు జాగ్రత్తలు తీసుకొని మనల్ని ఈ అంధకారంలో వదిలేసారు.

No comments:

Post a Comment